📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఅంగరంగ వైభవంగా రాజీవ్ గృహకల్ప లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు శ్రీనివాసు...

అంగరంగ వైభవంగా రాజీవ్ గృహకల్ప లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు శ్రీనివాసు ఆర్ జి కె మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ 8వ వార్డు రాజీవ్గృహకల్ప లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కాలనీ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాసు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కన్నుల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోచారం ఐటీ కారిడార్ ఎస్సై విజయభాస్కర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీం రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు మెట్టు బాల్ రెడ్డి పోచారం బాలగౌని వెంకటేష్ గౌడ్ మాజీ సర్పంచ్ గాంధారి లక్ష్మీనారాయణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు

 

ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అందించిన రాజధానిగా ప్రతి పౌరుడికి సమాన హక్కులు న్యాయం స్వేచ్ఛను కల్పించే దిశగా మహత్తరమైన మార్గా దర్శకమని ఆయన అన్నారు సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం అందించడంలో ఆయన చేసిన పనులు చిరస్మరణీయం అని అన్నారు అంబేద్కర్ ఆలోచనలు సూత్రాలు నేటికీ ప్రస్తుత సమాజానికి దిక్సూచి వంటివని యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు సమానత్వం సామాజిక న్యాయం విద్యాభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు

 

ఈ కార్యక్రమంలో పోచారం మాజీ ఉపసర్పంచ్ ఆకిటి బాల్ రెడ్డి ఆర్ జి కె దేవాదాయ శాఖ అధ్యక్షులు బైర ఐలయ్య కురుమ కొండల్ ఆర్.జి.కె మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొట్ల రామచందర్ శివ నాయక్ జయచంద్ర లొట్టిశ్వర్ వరికుప్పల వెంకటేష్ పల్లపు రమేష్ దండే జగన్నాథం రమేష్ గౌడ్ సారగండ్ల రమేష్ మాల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు జి బీములు ప్రధాన కార్యదర్శి యుపివి రమణ కోశాధికారి ఎస్ సుకుమార్ మరియు మాల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు సహకారంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.