ఘట్‌కేసర్, జూన్ 29: ఘట్‌కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ పరిధిలోని 318వ బూత్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేపట్టారు. మాజీ కౌన్సిలర్ కడపొల్ల మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్ తోక మల్లేష్ ఓటర్లకు ఫారాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తోటకూర జంగయ్య యాదవ్, వేముల మహేష్ గౌడ్ హాజరై ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి అర్హులైన ఓటరు తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మామిళ్ల ముత్యాలు యాదవ్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




