318వ బూత్‌లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ

ఘట్‌కేసర్, జూన్ 29: ఘట్‌కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ పరిధిలోని 318వ బూత్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేపట్టారు. మాజీ కౌన్సిలర్ కడపొల్ల మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్ తోక మల్లేష్ ఓటర్లకు ఫారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తోటకూర జంగయ్య యాదవ్, వేముల మహేష్ గౌడ్ హాజరై ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి అర్హులైన...