రేగొండలో ఎస్‌బీఐ బీసీ సీఎస్‌పీ పాయింట్ ప్రారంభం
బ్యాంక్ మేనేజర్ నరేష్ చేతుల మీదుగా మినీ బ్యాంక్ ప్రారంభం
జీరో అకౌంట్లు, కేవైసీ సేవలు గ్రామంలోనే అందుబాటులోకి
రేగొండ గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఎస్‌బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో బీసీ సీఎస్‌పీ పాయింట్‌ను ప్రారంభించారు. రేగొండ ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ చేతుల మీదుగా మినీ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సీఎస్‌పీ పాయింట్‌ను మోటం రాజుకు కేటాయించారు. ఈ కేంద్రంలో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ప్రారంభించడం, కేవైసీ అప్‌డేషన్, నగదు డిపాజిట్, నగదు విత్‌డ్రా వంటి సేవలు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ మేనేజర్ నరేష్ తెలిపారు.
10 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ సీఎస్‌పీ పాయింట్ ద్వారా జీరో అకౌంట్ తెరవవచ్చని, బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా గ్రామంలోనే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని సీఎస్‌పీ నిర్వాహకుడు మోటం రాజు తెలిపారు. బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలు మరియు ఇతర బ్యాంకింగ్ సేవల వివరాల కోసం 9640544093 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
రేగొండలో ఎస్‌బీఐ బీసీ సీఎస్‌పీ పాయింట్ ప్రారంభం
RELATED ARTICLES




