జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (prajava):తెలంగాణ రాష్ట్రంలోని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (విఆర్ఏ) దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, ముఖ్యంగా జీవో నంబర్ 81, 85లను పూర్తిస్థాయిలో అమలు చేయించి అర్హులైన వారసులకు ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్రస్థాయి నూతన కమిటీని గురువారం
టీజీఈ-జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన విఆర్ఏ ప్రతినిధుల సమక్షంలో
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ:
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు: గరికే ఉపేందర్,
రాష్ట్ర అధ్యక్షులు: దుండి మధు,
రాష్ట్ర జనరల్ సెక్రటరీ: ఏపూరి రవి,
రాష్ట్ర ఉపాధ్యక్షులు: చింత శివ (జనగాం జిల్లా),
రాష్ట్ర కన్వీనర్: శ్రీశైలం,
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్: సుల్తాన్ గౌడ్,
రాష్ట్ర కోశాధికారి: చందు
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ, విఆర్ఏ ల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. జీవో 81 అమలులో ప్రభుత్వం చూపుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించినా, సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమన్నారు
రాష్ట్రంలోని విఆర్ఏ ఏకతాటిపైకి తీసుకువచ్చి, హక్కుల సాధన కోసం ఐక్యంగా, బలంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. విఆర్ఏ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు, అర్హులైన ప్రతి వారసుడికి ఉద్యోగం లభించే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సైతం సిద్ధమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన విఆర్ఏ నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.

