విఆర్ఏ వారసులకు ఉద్యోగాలే లక్ష్యంగా నూతన కమిటీ ఎన్నిక
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (prajava):తెలంగాణ రాష్ట్రంలోని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (విఆర్ఏ) దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, ముఖ్యంగా జీవో నంబర్ 81, 85లను పూర్తిస్థాయిలో అమలు చేయించి అర్హులైన వారసులకు ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్రస్థాయి నూతన కమిటీని గురువారం టీజీఈ-జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన విఆర్ఏ ప్రతినిధుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ: రాష్ట్ర గౌరవ అధ్యక్షులు: గరికే ఉపేందర్, రాష్ట్ర అధ్యక్షులు: దుండి...