జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):జనగామ నియోజకవర్గంతొర్రూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుక గురువారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ
రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పెద్దలను గౌరవిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించాలని సూచించారు. కుటుంబ పెద్దలకు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నిశ్చితార్థ వేడుకలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

