📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్ఏపీలో మూడు గ్రామ పంచాయతీల్లో రీపోలింగ్‌కు ఎస్‌ఈసీ ఆదేశం.

ఏపీలో మూడు గ్రామ పంచాయతీల్లో రీపోలింగ్‌కు ఎస్‌ఈసీ ఆదేశం.

📰 Generate e-Paper Clip

ఏపీలో మూడు గ్రామ పంచాయతీల్లో రీపోలింగ్‌కు ఎస్‌ఈసీ ఆదేశం.

పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో రెండు గ్రామాల్లో రీపోలింగ్

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 27 వినుకొండ, పల్నాడు జిల్లా

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో మూడు గ్రామ పంచాయతీల్లో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదేశించింది.

పల్నాడు జిల్లా బొల్లాపల్లిమండలంలోని వెల్లటూరు,గరికపాడు గ్రామ పంచాయతీలతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలోని నర్సంపల్లి గ్రామ పంచాయతీలో రీపోలింగ్ నిర్వహించనున్నారు.

వెల్లటూరులో బ్యాలెట్ బాక్సు ధ్వంసం కావడం, గరికపాడులో పోలైన బ్యాలెట్ పత్రాలనుచించివేయడం, నర్సంపల్లిలో బ్యాలెట్ బాక్సులో ఇంకు పోయడం వంటి ఘటనల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మూడు గ్రామాల్లో నవంబర్ 27న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రీపోలింగ్ జరగనుంది.మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.