నర్సాయిపల్లి గ్రామంలో భూముల రీ-సర్వే ప్రారంభం
రైతులు, భూ యజమానులు అధికారులకు సహకరించాలి
గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ.
మద్దూరు నవంబర్27, ప్రజా వాణి,
మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో భూముల రీ-సర్వే ప్రక్రియ శుక్రవారం అధికారికంగా ప్రారంభమైంది….
గ్రామ సర్పంచ్ మరియు మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, సర్వేయర్ రమేష్, జీపీఓ రవి మరియు ఇతర గ్రామ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆధునిక సర్వే పరికరాలతో గ్రామ శివారు నుండి భూముల కొలతలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శనిగరం సత్యనారాయణ మాట్లాడుతూ… వారం రోజుల క్రితం గ్రామసభలో తెలిపిన విధంగానే నేటి నుండి గ్రామంలో భూముల రీ-సర్వే నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ రీ-సర్వేకు గ్రామంలోని రైతులు, భూ యజమానులు తమ పత్రాలతో సిద్ధంగా ఉండి, రెవెన్యూ మరియు సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

