📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపోక్సో కేసులో నిందితుడికి జీవితకాల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి జీవితకాల జైలు శిక్ష

📰 Generate e-Paper Clip

పోక్సో కేసులో నిందితుడికి జీవితకాల జైలు శిక్ష

11 వేల రూపాయలు జరిమానా

మద్దూరు నవంబర్27, ప్రజా వాణి,

మద్దూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కొయ్యడ శ్రావణ్ అనే వ్యక్తికి న్యాయస్థానం జీవిత జైలు శిక్షతో పాటు రూ.11,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం న్యాయమూర్తి వై. జయ ప్రసాద్ తీర్పు వెల్లడించారు.
వివరాలోకి వెళ్తే మద్దూరు పోలీస్ స్టేషన్లో మార్చి 2020లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ ఎ.సంపత్ పోక్సో కేసు నమోదు చేశారు.ఈ కేసులో దర్యాప్తు అధికారి అప్పటి హుస్నాబాద్ ఏసిపి ఎస్.మహేందర్ సమగ్ర దర్యాప్తు నిర్వహించి, పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి పటిష్టమైన ఛార్జిషీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేయడమైనది. విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మరాములు వాదనలు వినిపించగా, ప్రస్తుత హుస్నాబాద్ ఏసిపి సదానందం, చేర్యాల సిఐ రమేష్ ,మద్దూరు ఎస్ఐ ఆసిఫ్,సాక్షాలు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, లైజనింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సీడీఓలు కిష్టయ్య & లింగారెడ్డి, భరోసా లీగల్ అధికారి సౌమ్య సమన్వయంతో కేసు విచారణలో సహకారం అందించారు.
సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలించిన ఒకటవ అదనపు సిద్దిపేట జిల్లా న్యాయస్తాన న్యాయమూర్తి వై. జయ ప్రసాద్ నిందితుడిని దోషిగా నిర్ధారించి జీవిత జైలు శిక్షతో పాటు రూ.11,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని సిద్ధిపేట సిపి రష్మి పెరుమాళ్, ఐపిఎస్ గారు అభినందించారు.
మైనర్ బాలికలపై నేరాలకు పాల్పడే వారిని చట్టం ఉపేక్షించదని, ఇలాంటి కేసుల్లో శాస్త్రీయ దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాలతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా సిద్దిపేట పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని సిపి తెలిపారు. అలాగే పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని,పిల్లలతో నిరంతరం సంభాషిస్తూ వారి కదలికలపై తగిన పర్యవేక్షణ ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
తీర్పు అనంతరం నిందితుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మరాములు,చేర్యాల సిఐ రమేష్, ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, మద్దూరు ఎస్ఐ ఆసిఫ్ శాలువాతో సన్మానించి అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.