**అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూతే లక్ష్యం.. వేలేరులో లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ నగదు జమ!**
గౌరవ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారి ప్రత్యేక సహకారం, మార్గదర్శకత్వంతో వేలేరు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టిన వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చేయూత పింఛన్లు పొందిన లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడం ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక చేయూత వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. పింఛన్లు పొందిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ బిల్లా యాదగిరి వెల్లడించారు.

