📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగోవిందరావుపేటలో రేపు మెగా మెడికల్ క్యాంప్

గోవిందరావుపేటలో రేపు మెగా మెడికల్ క్యాంప్

📰 Generate e-Paper Clip

గోవిందరావుపేటలో రేపు మెగా మెడికల్ క్యాంప్

మంత్రి సీతక్క చేతుల మీదుగా మెగా వైద్య శిబిరం ప్రారంభం

పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఉచిత వైద్య సేవలు

ములుగు జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ఐఏఎస్.. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్ ఐపీఎస్.

గోవిందరావుపేట/ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

పోలీస్ అంటే కేవలం శాంతి భద్రతలు మాత్రమే కాదు… ప్రజల ఆరోగ్యం, ప్రజల సంక్షేమం కూడా తమ బాధ్యత అని ములుగు జిల్లా పోలీస్ శాఖ మరోసారి నిరూపిస్తోంది.

ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 28.11.2026 నాడు గోవిందరావుపేట PSR ఫంక్షన్ హాల్ లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు.

ఈ మెగా మెడికల్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఐఏఎస్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, ఐపిఎస్ పాల్గొననున్నారు.

సాధారణ జ్వరం మొదలు కంటి శస్త్ర చికిత్స వరకు దాదాపు *16 డిపార్ట్ మెంట్ లకు సంబంధించిన నిష్ణాతులైన డాక్టర్లను* ఈ క్యాంప్ కోసం పిలిపించడం జరుగుతుంది.

జిల్లా ప్రజల ప్రయోజనార్థం సదుద్దేశంతో తలపెట్టిన ఈ మంచి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఈ సమాచారాన్ని మీ బంధు మిత్రులకు తెలియచేసి, వైద్య సహాయం అవసరం ఉన్న వారికి మీ వంతుగా తోడ్పాటు అందించండి.

ప్రజల కోసం పోలీస్ శాఖ తలపెట్టిన ఈ బృహత్తర కార్యంలో మీరు కూడా పాలుపంచుకోండి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.