📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

📰 Generate e-Paper Clip

*నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి*

*జిల్లావ్యాప్తంగా 1,737 మంది విద్యార్థులు హాజరు.. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 27:–
జవహర్ నవోదయ విద్యాలయం ఆధ్వర్యంలో నవంబర్ 28న (శనివారం) నిర్వహించనున్న 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన 6వ తరగతి ప్రవేశ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,737 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.
పరీక్ష ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్మల్ పట్టణంలో విజయ హైస్కూల్ (మంజులాపూర్), వాసవి హైస్కూల్ (దివ్యనగర్), చాణక్య హైస్కూల్ (కమల్‌నగర్) కేంద్రాలను ఏర్పాటు చేశారు. భైంసాలో ఆల్‌ఫోర్స్ హైస్కూల్, వేదం హైస్కూల్, వాసవి హైస్కూల్‌లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఖానాపూర్ ప్రాంత విద్యార్థుల కోసం నిర్మల్‌లోని సెయింట్ థామస్ హైస్కూల్ కొండాపూర్‌లో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

*పరీక్ష కేంద్రాల వారీగా విద్యార్థుల వివరాలు*

విజయ హైస్కూల్‌లో 223 మంది, వాసవి హైస్కూల్‌లో 192 మంది, చాణక్య హైస్కూల్‌లో 192 మంది, భైంసా ఆల్‌ఫోర్స్ హైస్కూల్‌లో 264 మంది, వేదం హైస్కూల్‌లో 264 మంది, భైంసా వాసవి హైస్కూల్‌లో 243 మంది, సెయింట్ థామస్ హైస్కూల్ ఏ కేంద్రంలో 192 మంది, బి కేంద్రంలో 167 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు, హాల్‌టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ పెన్నులను వెంట తీసుకురావాలని డీఈఓ సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు నవోదయ విద్యాలయానికి చెందిన ఉపాధ్యాయులను సెంటర్ లెవల్ అబ్జర్వర్లుగా నియమించినట్లు తెలిపారు.
పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రంలో పోలీసు బందోబస్తు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల తహసీల్దార్లు ఫ్లయింగ్ స్క్వాడ్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని డీఈఓ దర్శనం భోజన్న సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.