📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్కోహెడ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన సీపీ రష్మి పెరుమాళ్

కోహెడ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన సీపీ రష్మి పెరుమాళ్

📰 Generate e-Paper Clip

 

విధుల్లో క్రమశిక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

సిద్దిపేట పోలీస్ కమిషనర్

సిద్దిపేట జిల్లా,నవంబర్ 27 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు కోహెడ ఎస్ఐ అభిలాష్ సిబ్బందితో రిపోర్ట్ చేయగా, ఎస్సై నిర్వహించిన పరేడ్‌ను సీపీ పరిశీలించారు.అనంతరం పోలీస్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.ప్రజల సమస్యలను ఓపికగా విని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమం ద్వారా సీసీటీవీ కెమెరాల నిఘాను విస్తరించేలా ఎస్ఐ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని,ప్రతి వర్టికల్ ఇన్‌చార్జ్ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.ఈ తనిఖీలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం, ట్రైనీ డీఎస్పీలు సుమాశ్రీ, భారత్ రెడ్డి, ఎండీ ముషరఫ్, హుస్నాబాద్ సీఐ శ్రీధర్, ఎస్సై అభిలాష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.