📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవిద్య, ఆరోగ్య సేవల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

విద్య, ఆరోగ్య సేవల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

📰 Generate e-Paper Clip

విద్య, ఆరోగ్య సేవల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

ఏటూరునాగారం నవంబర్ 26,ప్రజావాణి:

గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం, అవసరమైన వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం బ్రహ్మణపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల లను సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ:

ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన పీఓ, ఫార్మసీ, మందుల నిల్వ గదిని పరిశీలించారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న మందుల వివరాలు, వాటి నిల్వలు, అవసరమైన మందుల లభ్యత, స్టాక్ రిజిస్టర్ నిర్వహణను తనిఖీ చేశారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.

అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇన్‌పేషెంట్ ఔట్‌పేషెంట్ రిజిస్టర్లను పరిశీలించి, రికార్డుల నిర్వహణ తీరును సమీక్షించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు అందించే వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యా ప్రమాణాల పరిశీలన:

అనంతరం బ్రహ్మణపల్లి బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించిన పీఓ, పదో తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించి, వారి పఠన, లేఖన నైపుణ్యాలను స్వయంగా పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధమయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిమాణం మెనూ ప్రకారం ఉంటున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ఆటలు, క్రీడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా అని ఆరా తీశారు. విద్యతో పాటు శారీరక దృఢత్వం, క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అలాగే విద్యార్థుల బ్యాంకు ఖాతాల ప్రారంభం, వాటికి సంబంధించిన వివరాలను పోర్టల్‌లో రోజువారీగా నమోదు చేసి అప్‌డేట్ చేస్తున్నారా అనే అంశంపై ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల బ్యాంకు ఖాతాల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, హాజరు నమోదు ప్రక్రియను పోర్టల్‌లో పూర్తిచేసి, వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన వసతులు అందేలా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని పీఓ లెనిన్ వత్సల్ టోప్పో స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రగతి, ఆరోగ్య సేవల నాణ్యతపై ఐటీడీఏ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.