రాజ్యాంగాన్ని గౌరవించడం మన బాధ్యత
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వెంకన్న
ప్రజావాణి,నెల్లికుదురు: రాజ్యాంగాన్ని గౌరవించడం మనందరి బాధ్యతని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తూల్ల వెంకన్న అన్నారు. సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం) పురస్కరించుకొని గురువారం మండల కేంద్రం నెల్లికుదురు అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం,ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం,మానవ హక్కుల న్యాయ సమాజం కోసం అందరం కలిసికట్టుగా పోరాడి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి లు జల్ల ఉపేందర్,హెచ్ అశోక్ నాయకులు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్,ఆలకుంట్ల సాయిలు,పోరండ్ల గణేష్,చాగంటి రవి,తూల్ల వివేక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

