అట్టహసంగా ప్రారంభమైన మౌలానా మొయిజుద్దీన్ ఉర్సు ఉత్సవాలు
కులమతాలకు అతీతంగా ఊర్సుకు హాజరు కానున్న భక్తులు
జహీరాబాద్, నవంబర్ 26 (ప్రజావాణి): ఏడు శతబ్దాలకు పైగా ఘన చరిత్ర కలిగి ఉన్న సుప్రసిద్ధ చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉన్న హాజరాత్ మౌలానా మొయిజుద్దీన్ తుర్కీ రహేమతుల్లా అలై 768 వ ఊర్స్-ఏ-షరీఫ్ ఉత్సవాలు గురువారం నాటి నుంచి సర్కారి గందంతో అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల ఉర్సు ఉత్సవాల్లో భాగంగా రెండు రోజుల పాటు (శుక్ర, శనివారం) రసవత్తరమైన ఖవ్వాలి పోటీలు ఉండనున్నాయి. శుక్రవారం రోజు హిరమన్ సందల్ బీదర్ బేస్ కోహిర్ నుండి దర్గా వరకు బజాభాజంత్రిల మధ్య చదర్ ఊరేగింపుతో దర్గాకు చేరుకొనుంది. శనివారం నాడు మధ్యాహ్నం వివిధ రాష్ట్రలకు చెందిన ప్రముఖ మల్లాయోధుల నడుమ కుస్తీ పోటీలు నడుస్తాయి. శుక్రవారం, శనివారం నాడు రాత్రి నూస్రత్ ఖానం ముంబై మహారాష్ట్ర పార్టీ మరియు అలీ సబ్రీ గుజరాత్ రాష్ట్ర ఖవ్వాల్ మధ్య రసవత్తరమైన ఖవ్వాలి పోటీ జరగనుంది. ఉర్సులో హైదరాబాద్, సంగారెడ్డి, జహిరాబాద్, శేఖపూర్, బీదర్ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ రాజకీయ నాయకులు, సామజిక వేత్తలు, సామాజిక సేవకులు, హైదరాబాద్ కు చెందిన వర్తక వ్యాపారాలు పెద్దఎత్తున హాజరు అవుతారు. ఉర్సులో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ చర్యలు తీసుకుంటున్నామని, భక్తుల కోసం తాగునిటీ, అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్టు నిర్వాహక కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ షౌకత్ అలీ తెలిపారు.
