📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరైతులకు సమగ్ర పంటల యాజమాన్యంపై శిక్షణ

రైతులకు సమగ్ర పంటల యాజమాన్యంపై శిక్షణ

📰 Generate e-Paper Clip

రైతులకు సమగ్ర పంటల యాజమాన్యంపై శిక్షణ

మక్కపేట లో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమం

వత్సవాయి, నవంబర్ 24 మన ప్రజావాణి

జిల్లా వనరుల కేంద్రం, విజయవాడ వారి ఆధ్వర్యంలో వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో రైతులకు సమగ్ర పంటల యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.

ఈ కార్యక్రమంలో గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శివప్రసాద్ మరియు రాజశేఖర్ మాట్లాడుతూ పంటకు కావలసిన పోషకాలను అందించడానికి కేవలం రసాయన ఎరువులపైనే ఆధారపడకుండా జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు వాడుక వలన భూమిలో సేంద్రీయ కర్బనం పెరుగుతుందని తెలియజేశారు. సమగ్ర పోషక యాజమాన్యం వల్ల భూసారం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు. దాళ్వా సీజన్ లో వేయబోయే వరి మరియు మొక్కజొన్న పంటలలో ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్య రక్షణ గురించి రైతులకు వివరించారు.

సహాయ వ్యవసాయ సంచాలకులు భవాని రైతులకు నూతన ఎరువుల పంపిణీ విధానం (ఎఫ్.ఎఫ్.ఎస్ యాప్) పై అవగాహన కల్పించారు. ఇక నుండి యూరియా, డిఏపి తో పాటు కాంప్లెక్స్ ఎరువులు కూడా ఫోన్ బుకింగ్ ద్వారానే పొందగలరని, కావున రైతులు ఎటువంటి అపోహలకు లోనుగాకుండా తమ ఆర్.ఎస్.కె సిబ్బందిని సంప్రదించాలని తెలియజేశారు.

జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు మొనీష మాట్లాడుతూ రైతులు సమతుల్య ఎరువుల వాడకం ద్వారా భూసారాన్ని పరిరక్షించుకుంటూ సాగు ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు.

మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ మాట్లాడుతూ దాళ్వాలో వేసిన మొక్కజొన్న మరియు వరి పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.