📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపోగొట్టుకున్న రూ.1.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుతో పాటు విలువైన పత్రాలు, నగదు తిరిగి అందజేత

పోగొట్టుకున్న రూ.1.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుతో పాటు విలువైన పత్రాలు, నగదు తిరిగి అందజేత

📰 Generate e-Paper Clip

పోగొట్టుకున్న రూ.1.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుతో పాటు విలువైన పత్రాలు, నగదు తిరిగి అందజేత
నిజాయితీ చాటుకున్న కత్తెరపాక ధనుష్
మంచిర్యాల: నిజాయితీ, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మంచిర్యాల సాయికుంటకు చెందిన 11వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కత్తెరపాక ధనుష్ నిలిచారు.
దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బండ శాంతకు సంబంధించిన రూ.1,50,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కు పోగొట్టుకోగా, ఆ చెక్కు ఉన్న కవర్ కత్తెరపాక ధనుష్‌కు దొరికింది. అందులో చెక్కుతో పాటు ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, కొంత నగదు కూడా ఉన్నాయి.
వాటిని చూసిన ధనుష్ వాటి విలువను గుర్తించి, బాధ్యతగా వ్యవహరిస్తూ బాధితురాలు బండ శాంతను గుర్తించి, ఈరోజు చెక్కుతో పాటు నగదు, విలువైన పత్రాలన్నింటినీ తిరిగి అందజేశారు.
తనకు ఎంతో విలువైన పత్రాలు, నగదు, రూ.1.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును తిరిగి అందించిన ధనుష్ నిజాయితీకి కృతజ్ఞతలు తెలుపుతూ బండ శాంత ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో లింగంపల్లి బాపు, కొండా సురేష్, పేరుక రాజేష్, శాంతపురి నరేష్, ఎదుల లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
పోగొట్టుకున్న విలువైన వస్తువులను ఎలాంటి స్వార్థం లేకుండా తిరిగి అందజేసిన కత్తెరపాక ధనుష్ నిజాయితీని పలువురు అభినందించారు. సమాజంలో ఇలాంటి మానవతా విలువలు కలిగిన వ్యక్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.