📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారు

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారు

📰 Generate e-Paper Clip

*యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు*

*కాలకల్ గ్రామంలో అనుమతులు లేకుండా సెల్లార్‌తో కూడిన మూడు అంతస్తుల భవనం నిర్మాణం*

*పేదల ఇళ్ల నిర్మాణాలపై ఆంక్షలు.. బడాబాబుల నిర్మాణాలపై అధికారుల మౌనం అంటూ గ్రామస్తుల ఆవేదన*

మనోహరాబాద్ (ప్రజావాణి) మనోహరాబాద్ మండలంలోని కాలకల్ గ్రామంలో అనుమతులు లేకుండా సెల్లార్‌తో కూడిన మూడు అంతస్తుల భవన నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని సామాన్యులు ఇళ్లు నిర్మించుకుంటుంటే, అనుమతుల పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులు, భారీ నిర్మాణాలు చేపడుతున్న బడాబాబుల విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు సామాన్యులకేనా? పెద్ద నిర్మాణదారులకు వర్తించవా? అంటూ నిలదీస్తున్నారు.
గ్రామంలో సెల్లార్‌తో పాటు మూడు అంతస్తుల నిర్మాణం చేపడుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకపోతే నిబంధనలు అమలు చేస్తున్నట్లుగా ఎలా భావించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలకల్ గ్రామంలో జరుగుతున్న నిర్మాణంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి, చట్టం అందరికీ సమానంగా వర్తించేలా అధికారులు వ్యవహరించాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.