📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper

📰 Generate e-Paper Clip

రంగసముద్రం గ్రామపంచాయతీ అభివృద్ధి కావాలంటే సిపిఐ బలపరుస్తున్న బాల దాసరి సమతాను గెలిపించండి: సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర

పోరుమామిళ్ల/రంగసముద్రం:

రంగసముద్రం గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి జరగాలంటే నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. రంగసముద్రం సర్పంచ్ అభ్యర్థిని బాల దాసరి సమతను ‘కప్పు సాసర్’ గుర్తుపై మీ అమూల్యమైన, పవిత్రమైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

సోమవారం రంగసముద్రం సర్పంచ్ అభ్యర్థి సమత, ఏడో వార్డు అభ్యర్థి పెట్లు గురమ్మ, అలాగే పోరుమామిళ్ల 15, 18 వార్డుల నుంచి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థులు మహమ్మద్ రఫీ, కోడూరు కేశవల గెలుపును కాంక్షిస్తూ రంగసముద్రం పరిధిలోని పలు ప్రాంతాల్లో నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ… నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారానే గ్రామాల్లో, వార్డుల్లో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత పాలకులు, నేటి పాలకులు ఈ ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని, అధికారం, డబ్బు బలంతో గెలిచే వారికి ప్రజా సంక్షేమం పట్టదని, కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటారని విమర్శించారు.

విజ్ఞులైన ఓటర్లు ఆలోచించి, నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ నాయకులకు మద్దతుగా నిలవాలన్నారు. ఆర్థిక బలంతో ఓటర్లను మభ్యపెట్టే మోసగాళ్ల మాటలను నమ్మవద్దని హెచ్చరించారు. రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ ప్రాంతానికి వెళ్లినా సరైన రోడ్లు, కరెంటు, తాగునీటి సౌకర్యం లేక ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ అయినప్పటికీ అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిపోయిందని దుయ్యబట్టారు. ప్రభుత్వాల నుండి నిధులు రాబట్టడంలోనూ, ప్రజా గొంతుకై ప్రశ్నించడంలోనూ సిపిఐ అభ్యర్థుల గెలుపు ఎంతో అవసరమని, మన ప్రాంతాల అభివృద్ధి కోసమే ఓటర్లు తమ పవిత్రమైన ఓటును వేయాలని ఆయన కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, బాలు, మండల కార్యదర్శి రవికుమార్, పోరుమామిళ్ల పంచాయతీ 18వ వార్డు అభ్యర్థి కోడూరు కేశవ, రంగసముద్రం ఏడవ వార్డు అభ్యర్థి పెట్లు గురమ్మ, ఏరియా కార్యవర్గ సభ్యులు వెంకటరమణ, జి.ఎల్. నరసింహ, సఫా సునీల్, మండల నాయకులు బెల్లం భాషా, సాహిదా, శీను, విష్ణు, రామసుబ్బయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.