📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభ

ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభ

📰 Generate e-Paper Clip

*ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభ*

రాయికల్, నవంబర్ 23(ప్రజావాణి)

రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో 2025 ఏప్రిల్ నుండి 2026 మార్చి వరకు గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులు, చేయూత ద్వారా అందజేస్తున్న పింఛన్ వివరాలను సామాజిక తనిఖీ డీఆర్పీ కొత్తపెల్లి మమత పర్యవేక్షణలో సిబ్బంది 4 రోజులపాటు గ్రామంలో ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించారు. కేవలం పత్రాల్లోని లెక్కలకే పరిమితం కాకుండా, పని ప్రదేశాలకు వెళ్లి కొలతలు తీసి, కూలీలను, పింఛన్ లబ్ధిదారులను నేరుగా కలిసి, ఎన్ని రోజులు పని చేశారు, వేతనం సమయానికి అందిందా, పింఛన్ సక్రమంగా అందుతుందా అనే వివరాలను క్షుణ్ణంగా నమోదు చేశారు.సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభను సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ గ్రామంలో జరిగిన పనుల లెక్కను ప్రత్యక్షంగా విన్నారు.గ్రామంలో జరిగిన పనుల వివరాలు, అందులో ఉన్న లోపాలు,మంచిని గ్రామసభ దృష్టికి డీఆర్పీ మమత తీసుకువచ్చారు.ఈ సందర్భంగా సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్ మాట్లాడుతూ, గ్రామంలోని ఉపాధి హామీ పనులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు సూచించిన కొలతల ప్రకారం పనులు చేసి ప్రభుత్వం అందజేస్తున్న సగటు వేతనం పొందాలని అన్నారు. పథకాల ప్రయోజనం ప్రతి అర్హుడికి చేరాలంటే గ్రామస్తుల సహకారం, అప్రమత్తత ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుంపల నర్సారెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్వర్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్,వార్డుసభ్యులు,ఉపాధి హామీ మేట్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.