📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమిర్యాలగూడ APITCO కేంద్రంలో ఘనంగా PM విశ్వకర్మ అడ్వాన్స్ టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

మిర్యాలగూడ APITCO కేంద్రంలో ఘనంగా PM విశ్వకర్మ అడ్వాన్స్ టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

మిర్యాలగూడ APITCO కేంద్రంలో ఘనంగా PM విశ్వకర్మ అడ్వాన్స్ టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22

మిర్యాలగూడ
చేతివృత్తిదారుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం PM విశ్వకర్మ పథకాన్ని అమలు చేస్తోంది – *బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి*

ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, ఆధునిక పనిముట్లు, తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలు కల్పించడం అభినందనీయం – *బీజేపీ మిర్యాలగూడ కౌన్సిలర్ వెలుగు ఇంద్ర నాగరాజు*
*మిర్యాలగూడ* : చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సంప్రదాయ వృత్తిదారుల నైపుణ్యాన్ని పెంపొందించి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలనే గొప్ప లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న PM విశ్వకర్మ పథకం ద్వారా అనేకమంది చేతివృత్తిదారులు లబ్ధి పొందుతున్నారని *బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి అన్నారు* .
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని APITCO PM విశ్వకర్మ శిక్షణ కేంద్రంలో అడ్వాన్స్ టైలరింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ *కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, బీజేపీ మిర్యాలగూడ కౌన్సిలర్ వెలుగు ఇంద్ర నాగరాజు మాట్లాడుతూ* కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PM విశ్వకర్మ పథకం ప్రయోజనాలను ప్రతి అర్హులైన సంప్రదాయ చేతివృత్తిదారుడు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
*ఈ సందర్భంగా నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ* , PM విశ్వకర్మ పథకం కేవలం శిక్షణ కార్యక్రమం మాత్రమే కాదని, తరతరాలుగా సంప్రదాయ వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే గొప్ప పథకమని పేర్కొన్నారు. ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఆర్థిక సహాయం, పనిముట్లు, రుణ సదుపాయాలు కల్పించడం ద్వారా చేతివృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
*వెలుగు ఇంద్ర నాగరాజు మాట్లాడుతూ* , మహిళలు, యువత మరియు సంప్రదాయ వృత్తిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి రంగంలో ఎదగాలని, ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ ద్వారా తమ వృత్తి నైపుణ్యాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

*PM విశ్వకర్మ పథకం ద్వారా లభించే ముఖ్యమైన ప్రయోజనాలు* :

1. *బేసిక్ శిక్షణ* : అర్హులైన అభ్యర్థులకు 5 రోజుల పాటు ఉచిత ప్రాథమిక నైపుణ్య శిక్షణ.
2. *స్టైఫండ్* : ప్రాథమిక శిక్షణ సమయంలో రోజుకు రూ.500 చొప్పున, మొత్తం రూ.4,500 స్టైఫండ్.
3. *టూల్‌కిట్ ప్రోత్సాహకం* : రూ.15,000 విలువైన టూల్‌కిట్ ప్రోత్సాహకం.
4. *మొదటి విడత రుణం* : 18 నెలల తిరిగి చెల్లింపు వ్యవధితో రూ.1 లక్ష వరకు, 5 శాతం రాయితీ వడ్డీ రేటుతో రుణ సదుపాయం.
5. *బేసిక్ సర్టిఫికెట్* : ప్రాథమిక శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్.
6. *అడ్వాన్స్ శిక్షణ* : బేసిక్ శిక్షణ అనంతరం ఎంపికైన అభ్యర్థులకు అడ్వాన్స్ నైపుణ్య శిక్షణ.
7. *అడ్వాన్స్ శిక్షణ స్టైఫండ్* : అడ్వాన్స్ శిక్షణ సమయంలో రోజుకు రూ.500 చొప్పున, 15 రోజుల శిక్షణకు మొత్తం రూ.8,500 స్టైఫండ్.
8. *రెండవ విడత రుణం* : అర్హత నిబంధనలకు అనుగుణంగా రూ.2 లక్షల వరకు రుణ సదుపాయం, 5 శాతం రాయితీ వడ్డీ రేటుతో.
9. *అడ్వాన్స్ సర్టిఫికెట్* : అడ్వాన్స్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి సంబంధిత శిక్షణ సర్టిఫికెట్.
ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు చేతివృత్తిదారులకు తమ స్వంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి, ఆధునిక పరికరాలతో మెరుగైన సేవలు అందించడానికి, ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని వక్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో APITCO సెంటర్ SPOC నేరెళ్ళ అజయ్, మాస్టర్ ట్రైనర్లు జంగిలి రవికుమార్, అబ్దుల్ సమీ తదితరులు పాల్గొన్నారు.
సంప్రదాయ వృత్తులకు ఆధునిక నైపుణ్యాలు – చేతివృత్తిదారులకు ఆర్థిక భరోసా – ప్రతి విశ్వకర్మకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే PM విశ్వకర్మ పథకం లక్ష్యం.అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.