భారతీనగర్ డివిజన్లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి
రామచంద్రపురం, నవంబర్ 22 (ప్రజావాణి): ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీ, బాంబే కాలనీలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆమె పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. గతంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలులో ఎదురైన లోపాల కారణంగా కొందరు చిన్నారులు పోలియో బారిన పడిన ఘటనలు ఆందోళన కలిగించాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ ఒక్క చిన్నారిని కూడా ఈ కార్యక్రమం నుంచి మినహాయించకూడదన్నారు.ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన వైద్యులు డాక్టర్ ఆశుతోష్, సిస్టర్ సారా, ఎల్ఐజీ కాలనీ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాటి సత్యనారాయణ, మాజీ మైనారిటీ సర్కిల్ ఉపాధ్యక్షుడు ఘౌస్ భాయ్, మాజీ సర్కిల్ యువజన అధ్యక్షుడు నరసింహ, సతీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

