దామరంచ: రైతులకు వ్యవసాయ యంత్రాలు రాయితీపై అందించే పథకంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగు, క్రాప్ డేటా ఎంట్రీపై దామరంచ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు.rJamవ్యవసాయ యంత్రాలను 40 శాతం సబ్సిడీతో అందించే పథకం ద్వారా రైతులు ప్రయోజనం పొందాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా సొసైటీలు, ఎఫ్‌పీఓలు (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు), మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని alakaతెలిపారు. వ్యవసాయ పనులకు అవసరమైన యంత్రాలను రాయితీపై పొందేందుకు అర్హులైన రైతులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అలాగే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని భావిస్తున్న రైతులు క్రాప్ డేటా ఎంట్రీలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, సోలార్ ఫెన్సింగ్ వంటి వ్యవసాయ అవసరాలకు సంబంధించిన పథకాల ప్రయోజనాలు పొందాలనుకునే రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)ను సంప్రదించి నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి మహేశ్వరి తెలిపారు.alakరైతులు ప్రభుత్వ వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకొని సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఆమె arసూచించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ బోయిని శంకర్, pacs ఆధ్యక్షలు కమలాకర్ రెడ్డి ఉప సర్పంచ్ శంకర్ వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

