📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్దివంగత రెవరెండ్ బెల్లం సుధాకర్ ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహణ

దివంగత రెవరెండ్ బెల్లం సుధాకర్ ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

*దివంగత రెవరెండ్ బెల్లం సుధాకర్ ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహణ*

*ఆయన సేవలు, ఆధ్యాత్మిక జీవన ప్రయాణంపై ‘ఒక కాపరి జీవిత ప్రయాణం’ పుస్తకా విష్కరణ*

శామీర్‌పేట్: డివిజన్ పరిధిలోని దేవరయాంజాల్ గ్రామంలో ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ చర్చిలో దివంగత పాస్టర్ రెవరెండ్ బెల్లం సుధాకర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు, క్రైస్తవ సోదరుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా ఆర్టీఏ సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి, పాస్టర్ బి. శామ్యూల్, పాస్టర్ జాన్ బాబు, కుటుంబ సభ్యులు తదితరుల సమక్షంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒక వ్యక్తి జీవితంలో నమ్మిన విలువలు, సేవాభావం, ఆధ్యాత్మిక ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, బెల్లం సుధాకర్ జీవిత విశేషాలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని అన్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ తండ్రి బెల్లం సుధాకర్ ప్రేమ, ఆప్యాయత, సేవాభావం, మానవత్వం కలిగిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. ఆయన అందించిన ప్రేమ, చూపించిన మార్గదర్శకత్వం, నేర్పిన మంచి విలువలు తమ జీవితాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. ఆయన భౌతికంగా తమ మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు, ఆశయాలు, చేసిన సేవలు తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని భావోద్వేగంతో పేర్కొన్నారు.
కార్యక్రమం ప్రార్థనలు, నివాళులు, పుస్తకావిష్కరణతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.