📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో నూతన సీసీ రోడ్లుకు శంకుస్థాపన

ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో నూతన సీసీ రోడ్లుకు శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

*ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో నూతన సీసీ రోడ్లుకు శంకుస్థాపన*

మేడ్చల్:- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ సార ముత్యాలు గౌడ్ ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లంపేట మున్సిపల్ ప్రెసిడెంట్, కౌన్సిలర్ ఎర్రవల్లి విగ్నేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సంజీవరావు మాట్లాడుతూ, వార్డు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులను పరిష్కరించేందుకు ఈ పనులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. నూతన రహదారుల నిర్మాణంతో రాకపోకలు సులభతరం కావడంతో పాటు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడటం ద్వారా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా స్థానిక ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కౌన్సిలర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు పూర్తయితే వార్డు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు, కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.