📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా...

ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…

📰 Generate e-Paper Clip

*ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…..!*

*—- సర్పంచ్ గంగు రామస్వామి గౌడ్*

*రాయికల్; నవంబర్ 18 (ప్రజావాణి)*

నాయకుడు అంటే ఎన్నికలప్పుడే కనిపించే వాడు కాదు… ప్రజల కష్టంలో, సుఖంలో ఎప్పుడూ తోడుగా నిలిచే వాడు. అలాంటి నాయకుడే రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామ సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్. ఆయన నాయకత్వంలో వీరాపూర్ గ్రామం నేడు సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామాగా మారనుంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగింది. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు, ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ గంగు రామస్వామి గౌడ్, ఉప సర్పంచ్ దుంపల నర్సారెడ్డి,పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ చేతుల మీదుగా లబ్ధిదారులకు బుధవారం మంజూరు పత్రాలను అందజేశారు.మొత్తం 23 మందికి పింఛన్లు గీతా కార్మికులు – 14, ఒంటరి మహిళలు – 03, వితంతువులు – 05, దివ్యాంగులు – 01పత్రాలు అందుకున్న లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం… ముఖాల్లో వెలుగు. “ఈ పింఛన్ మాకు కేవలం డబ్బు కాదు, మా బతుకుకు భరోసా. ప్రభుత్వం మమ్మల్ని మరచిపోలేదనే ధైర్యం” అంటూ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆ క్షణం వీరాపూర్ గ్రామం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గంగు రామస్వామి గౌడ్ గ్రామ అభివృద్ధినే తన ఊపిరిగా మార్చుకున్నారు. గతంలో బురదమయంగా, గతుకులతో ఉండే అవ్వ చెరువు వద్ద రాయికల్ ప్రధాన రహదారి నేడు నునుపైన రోడ్డుగా మారింది.ఉపాధి హామీ పథకం నిధులు 10 లక్షల రూపాయలతో నీలి వెంకన్న ఇంటి నుండి రేణుక ఎల్లమ్మ దేవాలయం వరకు బైపాస్ సీసీ రోడ్డు నిర్మించి ఎమ్మెల్యేతో ప్రారంభించారు. ఈ రోడ్డుతో దేవాలయానికి వెళ్లే భక్తులకు, వాహనదారులకు ఎంతో సౌకర్యం కలిగింది.అంతేకాదు… ఎలాంటి ప్రభుత్వ నిధులు లేకున్నా, తన సొంత చొరవతో, గ్రామస్తుల సహకారంతో సోమ ధర్మయ్య ఇంటి నుండి జవ్వాజి శ్రీనివాస్ ఇంటి వరకు సీసీ రోడ్డు వేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిధులు లేవని ఆగిపోయే నాయకుడు కాదు, నిధులు తెచ్చే నాయకుడు అని నిరూపించారు.గ్రామ చివరన ఉన్న వైకుంఠధామం వరకు కరెంటు స్తంభాలు వేయించి, లైట్లు అమర్చి చీకటిని పారదోలారు. ఒకప్పుడు రాత్రి వేళ అక్కడికి వెళ్లాలంటే భయపడే వారు. నేడు దీపాల వెలుగులతో వైకుంఠధామం కళకళలాడుతోంది. ఇది కేవలం లైట్లు వేసిన పని కాదు… చనిపోయిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలికే మానవతా కార్యం అని గ్రామస్తులు కొనియాడుతున్నారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల నిధులతో మహిళా సంఘ భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ భవనం పూర్తయితే గ్రామ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ, స్వయం ఉపాధి, సమావేశాలకు ఒక శాశ్వత వేదిక దొరుకుతుంది. మహిళా సాధికారతకు ఇదే తొలి అడుగు అని సర్పంచ్ చెబుతున్నారు.”ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆశీస్సులతో, ప్రజల అండదండలతో వీరాపూర్ ను మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. ఇది కేవలం ఆరంభం మాత్రమే… ఇంకా చేయాల్సింది చాలా ఉంది” అని సర్పంచ్ గంగు రామస్వామి గౌడ్ స్పష్టం చేశారు.పింఛన్లు పొందిన లబ్ధిదారులు, గ్రామ పెద్దలు, యువత అంతా ఒక్క మాటగా… “మా సర్పంచ్ మా గ్రామానికి దొరికిన వరం. మాట తప్పని మనిషి… మడమ తిప్పని నాయకుడు” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.