ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…
*ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.....!* *---- సర్పంచ్ గంగు రామస్వామి గౌడ్* *రాయికల్; నవంబర్ 18 (ప్రజావాణి)* నాయకుడు అంటే ఎన్నికలప్పుడే కనిపించే వాడు కాదు... ప్రజల కష్టంలో, సుఖంలో ఎప్పుడూ తోడుగా నిలిచే వాడు. అలాంటి నాయకుడే రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామ సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్. ఆయన నాయకత్వంలో వీరాపూర్ గ్రామం నేడు సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామాగా మారనుంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణంలో...