📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅమీన్పూర్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం

అమీన్పూర్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం

📰 Generate e-Paper Clip

అమీన్పూర్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం…

సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అమీన్పూర్ పోలీసులు

అమీన్పూర్, నవంబర్ 18 (ప్రజావాణి): అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోల్ గ్రామానికి చెందిన సరిత (24) భర్త మరణించడంతో జీవనోపాధి నిమిత్తం అమీన్పూర్‌లో నివాసం ఉంటోంది. తన ఇద్దరు కూతురు లతో కలిసి ఆర్‌ఆర్ హోమ్స్‌లోని తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సరిత చిన్న కుమార్తె అక్షిత (3) కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు అమీన్పూర్ పోలీసులను ఆశ్రయించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అమీన్పూర్ ప్రధాన రహదారితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీఐ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు చిన్నారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. చిన్నారి అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.