పెనుగంచిప్రోలు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా లగడపాటి జయమ్మ ఖరారు
ఏకాభిప్రాయంతో ఎంపిక – ఎన్నికలకు టీడీపీ పూర్తి సన్నద్ధం
పెనుగంచిప్రోలు, నవంబర్ 17 మన ప్రజావాణి
పెనుగంచిప్రోలు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిత్వం ఖరారైంది. తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా లగడపాటి జయమ్మ, W/o లగడపాటి వెంకటేశ్వరరావు పేరును పార్టీ ప్రకటించింది.
ఎట్టకేలకు పెనుగంచిప్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ ఏకాభిప్రాయానికి వచ్చింది. పార్టీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, పెద్దల మాటను గౌరవించి గింజుపల్లి గోపి సహకరించారు. పరస్పర అంగీకారంతో ఆశావహులందరూ ఏకాభిప్రాయానికి రావడంతో అభ్యర్థిత్వం ఖరారైంది.
ఈ సందర్భంగా గ్రామంలో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే పంచాయతీ ఎన్నికలకు పెనుగంచిప్రోలు టీడీపీ పూర్తి సన్నద్ధంగా ఉందని పార్టీ నాయకులు తెలిపారు.

