పోరుమామిళ్ల నవంబర్ 18ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గంలోని ప్రముఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రమైన పోరుమామిళ్ల టౌన్ మేజర్ పంచాయతీ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున షేక్ అర్షియా బుధవారం అత్యంత వైభవంగా,భారీ జనసందోహం మధ్య తన నామినేషన్‌ను దాఖలు చేశారు.పార్టీ శ్రేణులు,ప్రజాప్రతినిధులు, ప్రజల అపూర్వ మద్దతుతో ఈ కార్యక్రమం ఒక పండుగలా సాగింది.కార్యాలయం నుంచి పంచాయతీ వరకు ‘జన జాతర’సర్పంచ్ అభ్యర్థి షేక్ అర్షియా గారి నామినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పోరుమామిళ్లలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉదయం నుంచే కోలాహలం నెలకొంది.నియోజకవర్గంలోని ముఖ్య నేతలు,కార్యకర్తలు,వైఎస్సార్సీపీ అభిమానులు,ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.పార్టీ కార్యాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు.పార్టీ జెండాలు,నినాదాలతో పోరుమామిళ్ల పురవీధులన్నీ వైఎస్సార్సీపీ రంగులతో నిండిపోయాయి.తరలివచ్చిన ముఖ్య నాయకులుఈ భారీ నామినేషన్ ర్యాలీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అగ్రనాయకులు,ప్రముఖులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో పాటు,ఈ ఎన్నికల రథసారథి, నియోజకవర్గ యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి,మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి, ప్రముఖ నాయకులు కల్లూరి రమణారెడ్డి,సీఎం భాషా,ఈశ్వరమ్మ,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,రాజీవ్, రాళ్లపల్లి నరసింహులు తదితరులు ముందుండి ర్యాలీని నడిపించారు.నాయకుల రాకతో కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం వ్యక్తమైంది.
పోరుమామిళ్ల అభివృద్ధి మా బాధ్యత: ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డినామినేషన్ అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ.పోరుమామిళ్ల గ్రామ సర్వతోముఖాభివృద్ధికి తమ నాయకులందరం కలిసికట్టుగా,ఒకే తాటిపై నిలిచి కృషి చేస్తామని స్పష్టం చేశారు.గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో గ్రామానికి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఎన్నో నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన గుర్తు చేశారు.రాబోయే రోజుల్లో కూడా పోరుమామిళ్లను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.విద్యావంతురాలు, సేవాతత్పరత కలిగిన షేక్ అర్షియా గారిని సర్పంచ్‌గా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే.గ్రామానికి మరింతగా నిధులు సాధించి,తమ సంపూర్ణ సహకారంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం దేవసాని ఆదిత్య రెడ్డి ఎన్నికల రథసారథి,యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ.పోరుమామిళ్ల పట్టణాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చాటిచెప్పారు.ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని,స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తామని భరోసా ఇచ్చారు.ఈ నామినేషన్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించిన స్థానిక ప్రభుత్వ అధికారులకు,రాత్రింబవళ్లు శ్రమించిన పోలీసు యంత్రాంగానికి,వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తిపోరుమామిళ్ల మేజర్ పంచాయతీ పరిధిలోని ఓటర్లు, ప్రజలందరూ ఆలోచించి, అభివృద్ధికి అండగా నిలిచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి షేక్ అర్షియాకి తమ అమూల్యమైన ఓటు వేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి,యువనేత దేవసాని ఆదిత్య రెడ్డి పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగరేసి,అర్షియాని అత్యధిక మెజారిటీతో గెలిపించి పోరుమామిళ్ల ప్రగతికి సహకరించాలని వారు ఘనంగా విజ్ఞప్తి చేశారు.ర్యాలీలో పాల్గొన్న మహిళలు,అభిమానుల కోలాహలం చూస్తుంటే వైఎస్సార్సీపీ విజయం ఖాయమని స్థానిక నేతలు ధీమా వ్యక్తం చేశారు.
పోరుమామిళ్లలో వైఎస్సార్సీపీ ‘నామినేషన్’హోరు:సర్పంచ్ అభ్యర్థిగా షేక్ అర్షియా.భారీ ర్యాలీగా తరలివచ్చిన నేతలు,జనం
RELATED ARTICLES

