కంభంపాడు వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా శీలం ఉషా ఎంపిక*
కంభంపాడులో వైసీపీ ఆత్మీయ సమావేశం – సర్పంచ్, 12 వార్డుల అభ్యర్థులకు మద్దతు
వత్సవాయి, నవంబర్ 18 మన ప్రజావాణి
జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శీలం ఉషా ని పార్టీ తరఫున బలపరచాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న) పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా ఎంపికైన శీలం ఉషా కి మరియు గ్రామంలో ఉన్న 12 వార్డుల అభ్యర్థులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచి, ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేయాలని తన్నీరు నాగేశ్వరరావు కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు తీగల కృష్ణ, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, నియోజకవర్గ పంచాయతీ రాజ్ వింగ్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి వెంకట నారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

