📄 ePaper
Epaper 2
Monday, November 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణస్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల( ఆర్ట్స్ కాలేజ్) లో ఫ్రెషర్స్ పార్టీ

స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల( ఆర్ట్స్ కాలేజ్) లో ఫ్రెషర్స్ పార్టీ

📰 Generate e-Paper Clip

కడప : ప్రజావాణి నవంబర్ 16 :
స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల( ఆర్ట్స్ కాలేజ్) లో ఈరోజు 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటలక్ష్మి గారు అధ్యక్షత వహించి నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులు ఒక మంచి లక్షంతో ప్రణాళిక బద్ధంగా చదువుతూ ఉన్నత స్థాయిని అధిరోహించాలని సూచించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన యోగివేమన విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ దాము గారు మాట్లాడుతూ విద్యార్థులు ఎదురయ్యే అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నత చదువులను చదివి మంచి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటసుబ్బయ్య గారు మాట్లాడుతూ విద్యార్థికి పుస్తక పఠనం ప్రధానమైనదని తెలియజేశారు. సీనియర్ విద్యార్థులు ఫ్రెషర్స్ కి వెల్కమ్ చెబుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.