పోరుమామిళ్ల (వైఎస్ఆర్ జిల్లా):నవంబర్ 16ప్రజావాణి పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సునిహ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. విశ్వనాథరెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి వేలాది మంది ప్రజలు, వైసీపీ శ్రేణులు తరలిరావడంతో పోరుమామిళ్ల పట్టణం జనసంద్రంగా మారింది.అన్వర్ భాష వారసురాలిగా బరిలోకి.గ్రామంలో కొత్త ఉత్సాహం గత 30 ఏళ్లుగా పోరుమామిళ్ల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని, నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైన షేక్ అన్వర్ భాష (అల్లా) కుమార్తె షేక్ సునిహకు ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో గ్రామ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం మొదలైంది.నల్లేరు విశ్వనాథరెడ్డి వ్యూహాత్మక నిర్ణయంతో బరిలోకి దిగిన సునిహకు,తండ్రి ప్రజాదరణ తోడవడంతో గ్రామస్థుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.కిక్కిరిసిన పోరుమామిళ్ల వీధులు నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్వహించిన భారీ ర్యాలీకి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువత పెద్ద ఎత్తున పోటెత్తారు.డప్పు వాయిద్యాలు,నినాదాలతో పోరుమామిళ్ల ప్రధాన రహదారులు,వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ నాయకుడు విశ్వనాథరెడ్డికి, అభ్యర్థి సునిహకు ఘనస్వాగతం పలికారు.పోరుమామిళ్లను అభివృద్ధిలో నంబర్ వన్ చేస్తాం: నల్లేరు విశ్వనాథరెడ్డి నామినేషన్ అనంతరం బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ ప్రత్యర్థులపై, గ్రామ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఇది కేవలం ఒక సాధారణ నామినేషన్ కార్యక్రమం కాదు, పోరుమామిళ్ల ప్రజల ఆత్మగౌరవానికి, రాబోయే ఘన విజయానికి ఇది నాంది.గత 30 ఏళ్లుగా అన్వర్ భాష ఈ ప్రాంత ప్రజలకు చేసిన సేవలే నేడు ఈ జనసందోహానికి నిదర్శనం.మేజర్ పంచాయతీ అయిన పోరుమామిళ్లలో ప్రధాన సమస్యలైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు మరియు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించి, గ్రామాన్ని అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలబెడతాం. ప్రజలందరి ఆశీర్వాదంతో షేక్ సునిహ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ ముఖ్య నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ వార్డుల నాయకులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని సునిహకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
జనసంద్రంగా మారిన పోరుమామిళ్ల.నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో షేక్ సునిహ నామినేషన్
RELATED ARTICLES

