స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల( ఆర్ట్స్ కాలేజ్) లో ఫ్రెషర్స్ పార్టీ

కడప : ప్రజావాణి నవంబర్ 16 : స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల( ఆర్ట్స్ కాలేజ్) లో ఈరోజు 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటలక్ష్మి గారు అధ్యక్షత వహించి నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులు ఒక మంచి లక్షంతో ప్రణాళిక బద్ధంగా చదువుతూ ఉన్నత స్థాయిని అధిరోహించాలని సూచించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన యోగివేమన విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ దాము గారు మాట్లాడుతూ విద్యార్థులు...