📄 ePaper
Epaper 2
Monday, November 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణIJU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా రాంచందర్ చారి..! ఘన సన్మానం..

IJU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా రాంచందర్ చారి..! ఘన సన్మానం..

📰 Generate e-Paper Clip

*IJU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా రాంచందర్ చారి..! ఘన సన్మానం..!*

*”నియోజకవర్గ అభివృద్ధికి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటా” – రాంచందర్ చారి..!*

*నారాయణఖేడ్: ప్రజావాణి న్యూస్ ప్రతినిధి బాలరాజు*

నారాయణఖేడ్ నియోజకవర్గానికి మరో అరుదైన గౌరవం దక్కింది. సీనియర్ జర్నలిస్టు, నిజాయితీకి, నిక్కచ్చితనానికి మారుపేరైన *IJU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాంచందర్ చారి* గారు నూతనంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయం తెలియగానే నియోజకవర్గం వ్యాప్తంగా జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. ఆయనకు అభినందనల వెల్లువ కురుస్తోంది.

*అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా”*

నూతనంగా ఎన్నికైన సందర్భంగా రాంచందర్ చారి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
TUWJ H-143 నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. జర్నలిస్టుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తాను. జర్నలిస్టు అంటేనే ప్రజల గొంతు. ఆ గొంతును జాతీయ స్థాయిలో వినిపించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.
*పెద్దలకు కృతజ్ఞతలు..!l*
తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన పెద్దలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు అల్లం నారాయణ ,ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ,TUWJ రాష్ట్ర అధ్యక్షులు విర్రపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ,జిల్లా నాయకులు యాదగిరి గౌడ్ గారికి సంగారెడ్డి జిల్లా యూనియన్ నాయకులకు వారి సహకారం, ఆశీర్వాదం మరువలేనిది. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను” అని ఆయన అన్నారు.
“జాతీయ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్ర యూనియన్ వాణిని వినిపించేందుకు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటాను. అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్, వేతన సమస్యలు.. ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తాను” అని రాంచందర్ చారి హామీ ఇచ్చారు.

*జర్నలిస్టుల్లో నూతన ఉత్సాహం..!*

రాంచందర్ చారి ఎన్నికతో నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. “మా గొంతు ఇక ఢిల్లీ వరకు వినిపిస్తుంది. మా సమస్యలకు ఇక పరిష్కారం దొరుకుతుంది” అని జర్నలిస్టులు ఆనందం వ్యక్తం చేశారు.

“నిజాయితీగా, నిర్భయంగా వార్తలు రాసే రాంచందర్ చారి గారికి ఈ పదవి రావడం నియోజకవర్గానికే గర్వకారణం” అని ప్రజలు, నాయకులు అంటున్నారు.

*నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..!*

కేవలం జర్నలిస్టుల సమస్యలే కాదు, నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, రోడ్లు, నీరు, విద్య, వైద్యం వంటి అంశాలపై కూడా తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన కలాన్ని ఉపయోగిస్తానని చెప్పారు.
*అభినందనల వెల్లువ..!*
ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు రాంచందర్ చారి గారికి ఫోన్ ద్వారా, నేరుగా కలిసి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.