📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్లైటుగా తీసుకోవద్దు.. నేతలను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

లైటుగా తీసుకోవద్దు.. నేతలను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

లైటుగా తీసుకోవద్దు.. నేతలను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 అమరావతి

పంచాయతీలు-పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేతలు, కేడర్ని అలర్ట్ చేశారు సీఎం చంద్రబాబు. పంచాయతీ ఎన్నికలు లైటుగా తీసుకోవద్దని తేల్చి చెప్పేశారు.

కింద స్థాయిలో మంచి నాయకులను తీర్చి దిద్దడానికి ఇది చక్కటి అవకాశంగా చెప్పుకొచ్చారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి దశలో 3967 గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆదివారం అభ్యర్థుల నుంచి నామినేషన్లు మొదలయ్యాయి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1295 నామినేషన్ కేంద్రాలను రెడీ చేశారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది..

పంచాయతీలు-పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యలో నేతలు, కేడర్ని అలర్ట్ చేశారు సీఎం చంద్రబాబు. పంచాయతీ ఎన్నికలు లైటుగా తీసుకోవద్దని తేల్చిచెప్పేశారు. కింద స్థాయిలో మంచి నాయకులను తీర్చిదిద్దడానికి ఇది చక్కటి అవకాశంగా చెప్పుకొచ్చారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి దశలో 3967 గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆదివారం అభ్యర్థుల నుంచి నామినేషన్లు మొదలయ్యాయి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1295 నామినేషన్ కేంద్రాలను రెడీ చేశారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలను అలర్ట్ చేశారు సీఎం చంద్రబాబు. శనివారం రాత్రి ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ అధినేత, ఎట్టి పరిస్థితుల్లోను గొడవలకు వెళ్లవద్దన్నారు. చెడ్డ పేరు తెచ్చుకోవద్దని ముఖ్యంగా శ్రేణులకు సూచించారు. హింసను గొడ్డలి పార్టీ నమ్ముకుంటే, కూటమి మాత్రం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతోందన్నారు.

మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని గుర్తు చేశారు. ఈవీఎం, బ్యాలట్ విధానం ఏదైనా కూటమి హవానే కొనసాగుతోందన్నారు.

గతం కంటే 25 శాతం ఓటు బ్యాంకు పెరిగిందన్న సీఎం చంద్రబాబు, ఉద్యోగులంతా కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారని వివరించారు. 7 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశామని, అనకాపల్లి-మార్కాపురం జిల్లాల్లో అయితే 100 శాతం స్ట్రైక్ట్ సాధించామని వివరించారు.

రాప్తాడు ఘటన బాధితురాలి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్.. ఇప్పుడెలా ఉందంటే

వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏ మాత్రం ప్రజలు నమ్మడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికల్ని తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు.

క్షేత్రస్థాయిలో మంచి నాయకుల్ని తీర్చిదిద్దడానికి ఇదొక చక్కటి అవకాశంగా వర్ణించారు. గ్రామ స్థాయిలో కూటమి బలపరిచే అభ్యర్థులు గెలవాలని, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగుతాయన్నారు. నాలుగు కార్పొరేషణ్ణు, 19 మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు.

స్థానిక ఎన్నికల్లో యువత, విద్యావంతులకు అవకాశం కల్పించామని, పంచాయతీ ఎన్నికల్లో అదే ఒరవడి కంటిన్యూ చేయాలన్నారు.

రాబోయే మూడు దశాబ్దాలకు ఉపయోగపడేలా నాయకత్వాన్ని నిర్మించేలా అడుగులు వేయాలన్నారు. ఉమ్మడి ప్రకాశం, విశాఖ జిల్లాలకు కృష్ణా-గోదావరి జలాల్ని తీసుకెళ్లడంతో మంచి ఫలాలు వచ్చాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.