📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్ప్రజాక్షేత్రంలో ఆదిత్య రెడ్డి అడుగులు.షేక్ అర్షియా గెలుపే లక్ష్యంగా

ప్రజాక్షేత్రంలో ఆదిత్య రెడ్డి అడుగులు.షేక్ అర్షియా గెలుపే లక్ష్యంగా

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల నవంబర్ 15ప్రజావాణి మేజర్ గ్రామ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి షేక్ అర్షియా విజయమే లక్ష్యంగా నియోజకవర్గ ఎన్నికల రథసారథి,యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి సారథ్యంలో రెండో రోజు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది.ఈ సందర్భంగా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మాయాబజార్ వీధి,ఉద్దికట్ట వీధుల్లో పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓటు వేసి షేక్ అర్షియాని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆదిత్య రెడ్డి.అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పోరుమామిళ్లలో రహదారులు,డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతులతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు.మరోసారి షేక్ అర్షియా ని సర్పంచ్‌గా గెలిపిస్తే పోరుమామిళ్లలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ,రహదారులు, డ్రైనేజీలు,తాగునీటి సమస్యలను పరిష్కరించి,మున్సిపాలిటీ స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పోరుమామిళ్లను మరింత అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజల ఆశీస్సులు,పార్టీ శ్రేణుల ఐక్యతతో పోరుమామిళ్ల అభివృద్ధికి నూతన బాటలు వేయడమే తమ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సీఎం భాష రాష్ట్ర మరియు జిల్లా మరియు మండల అనుబంధ విభాగాల నాయకులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,రాజీవ్ భాష,రాళ్లపల్లి నరసింహులు,తులసి సురేష్,ఇషాక్,షేక్ మస్తాన్,హుస్సేన్ పీరా,సుబ్బారావు,రామయ్య, మహబూబ్ బాషా,రామయ్య, బ్రహ్మయ్య,సద్దాం,దాదాభాష,చాపాటి సాయి నారాయణ రెడ్డి,పార్టీ నాయకులు,కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.