📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణదీప్లా నాయక్ తండాలో వెలుగులు నింపిన అచ్చనోళ్ళ శ్రీనివాస్ గౌడ్

దీప్లా నాయక్ తండాలో వెలుగులు నింపిన అచ్చనోళ్ళ శ్రీనివాస్ గౌడ్

📰 Generate e-Paper Clip

దీప్లా నాయక్ తండాలో వెలుగులు నింపిన అచ్చనోళ్ళ శ్రీనివాస్ గౌడ్
​సొంత ఖర్చుతో హైమాస్ట్ (High-Mast) లైట్ల ఏర్పాటు
​తండాలో దొంగతనాల నివారణకు సర్పంచ్ అంజలి భరత్ విజ్ఞప్తి మేరకు స్పందన
​పలు గ్రామాల సర్పంచుల చేతుల మీదుగా శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సన్మానం

పరిగి/ ​కుల్కచర్ల, నవంబర్ 15:ప్రజా వాణి:

మండలంలోని నూతన గ్రామ పంచాయతీ అయిన దీప్లా నాయక్ తండాలో అంధకారాన్ని తొలగిస్తూ తిరుమలాపూర్‌కు చెందిన అచ్చనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ తన సొంత నిధులతో హైమాస్ట్ (ఐమాక్స్) లైట్లను ఏర్పాటు చేయించారు.
​నూతనంగా ఏర్పడిన ఈ తండాలో వీధి దీపాలు లేక రాత్రి వేళల్లో చీకటి కమ్ముకుందని, దీనివల్ల దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామ సర్పంచ్ అంజలి భరత్ ఇటీవల శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన ఆయన, తన సొంత డబ్బులతో హైమాస్ట్ లైట్లను బిగించి తండా వాసుల కష్టాలను తీర్చారు.
​శనివారం రాత్రి 7 గంటలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ ఈ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ.. చీకట్లో మగ్గుతున్న తండాలకు వెలుగులు పంచుతున్న అచ్చనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ సేవా నిరతిని కొనియాడారు. గతంలోనూ ఆయన బండ వెల్కిచర్ల, లాల్ సింగ్ తండా, అంతారం, తిరుమలాపూర్ తదితర గ్రామాల్లో సొంత ఖర్చులతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించడాన్ని గుర్తు చేస్తూ, ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
​ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, శ్రీనివాస్ మిత్రబృందం సభ్యులు అశ్రఫ్, శ్రీధర్, చిన్న రెడ్డి, బాలు, కృష్ణయ్య మరియు తండా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.