జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది సహకారాలతో సమర్థవంతంగా నేరాలను కట్టడి చేయగలిగాము జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 నంద్యాల జిల్లా
నంద్యాల జిల్లాలో 2026 సంవత్సర కాలములో జనవరి నుండి అక్టోబర్ నెల వరకు జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీస్ వారు సాధించిన విజయాలు మరియు నేర నివేదిక వివరాలను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారాలతో సమర్ధవంతంగా నేరాలను కట్టడి చేయగలిగాము ఎస్పీ
నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లప్పుడు నంద్యాల జిల్లా పోలీసు శాఖ ముందు ఉంటుందని నంద్యాల జిల్లా ఎస్పీ.సునీల్ షొరాణ్ IPS తెలిపారు. నేడు 2026 సంవత్సర కాలములో జనవరి నుండి అక్టోబర్ నెల వరకు నేర నివేదిక వివరాలను ప్రకటించడం జరిగింది. 2025-2026 వ సంవత్సరాలలో జరిగిన నేరాలను ఒకదానితో ఒకటి పోల్చి, గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల దర్యాప్తులో, నేర నియంత్రణలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎటువంటి పురోగతి సాధించామని వివరించారు.
హత్య నేరాలు, ఉద్దేశపూర్వకంగా చేయని హత్యలు:
2025 సంవత్సరంతో పోలిస్తే హత్యలు కొంతమేరకు పెరిగిన ఉద్దేశపూర్వక హత్యలు, దోష పూర్వక హత్యలు 2025 సంవత్సరంలో 47 నమోదు కాగా 2026వ సంవత్సరంలో (జనవరి నుండి అక్టోబర్ ) ఇప్పటివరకు 42 కేసులు నమోదు కావడంతో నేరాలు గణనీయంగా తగ్గడం జరిగింది.
సాధారణ ఘాత నేరాలు:
2025 సంవత్సరంలో 530 సాధారణ ఘాత నేరాలు జరిగితే 2026 సంవత్సరంలో 474 సాధారణ ఘాత నేరాలు నమోదు కాగా నేరాలు గణనీయంగా తగ్గాయి.
చీటింగ్ కేసులు
2025 సంవత్సరంలో 153 కేసులు నమోదు కాగా ప్రస్తుతం 92 కేసులు నమోదు కావడంతో నేరాలు గణనీయంగా తగ్గడం జరిగింది.
ప్రాపర్టీకి సంబందించిన నేరాలు:
దోపిడీ, బందిపోటు నేరాలు, రాత్రి సమయంలో జరిగిన దొంగతనాలు పగలు సమయంలో జరిగిన దొంగతనాలు 2025 సంవత్సరంలో 100 నేరాలు జరిగితే 2026 వ సంవత్సరంలో 82 నేరాలు జరిగాయి. పోలీస్ అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ, రాత్రి, పగలు సమర్థవంతంగా గస్తీలు నిర్వహించడం వలన నేరాలు గణనీయంగా తగ్గాయి.
పోక్సో కేసులు:
2025 సంవత్సరంలో 47 నేరాలు జరిగితే 2026 వ సంవత్సరంలో 35 నేరాలు జరిగాయి. మహిళ పోలీసులతో పాఠశాలలో,కళాశాలలో మరియు విద్యా సంస్థలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి,నేరాలకు పాల్పడితే జరిగే పరిణామాల గురించి, కోర్టులలో ముద్దాయిలకు శిక్షలు విదించడం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం వలన పోక్సో కేసులు గణనీయంగా తగ్గాయి.
స్పెషల్ అండ్ లోకల్ లాస్ (స్థానిక మరియు ప్రత్యక చట్టాలు )
స్పెషల్ అండ్ లోకల్ లాస్ కేసులకు సంబంధించి 2025వ సంవత్సరంలో 613 కేసులు నమోదు కాగా ప్రస్తుతం 427 కేసులు నమోదు కావడంతో నేరాలు ఘననీయంగా తగ్గడం జరిగింది.
కిడ్నాప్ లు:
2025 సంవత్సరంలో 09 కిడ్నాప్ లు జరిగితే 2025 సంవత్సరంలో 08 కిడ్నాప్ లు జరిగాయి. దీనిని బట్టి చుస్తే కిడ్నాప్ లు స్వల్పంగా తగ్గాయి.
తీవ్ర ఘాత నేరాలు:
2025 సంవత్సరంలో 13 తీవ్ర ఘాత నేరాలు జరిగితే 2026 సంవత్సరంలో 12 తీవ్ర ఘాత నేరాలు నమోదు కావడంతో తీవ్ర ఘాత నేరాలు స్వల్పంగా తగ్గాయి.
రాబరీ కేసులు:
2025 సంవత్సరంలో 9 నమోదు కాగా 2026వ సంవత్సరంలో కూడా 9 నమోదు కావడం జరిగింది.
రోడ్డు ప్రమాదాలు:
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ గారు నిత్యం రోడ్డు ప్రమాదాల గురించి సమీక్షిస్తూ పోలీస్ అధికారులు, సిబ్బంది బ్లాక్ స్పాట్స్, యాక్సిడెంట్ ప్రోస్ ఏరియాలలో విధులు నిర్వహిస్తూ వాహనదారులకు, ప్రజలకు రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కల్పిస్తూ, ఒకసారి రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశంలో మరోసారి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వాహన వేగాలను నియంత్రించడానికి రేడియం స్టిక్కర్ అతికించిన బారికేడ్స్ లను ఏర్పాటు చెయ్యడం, సిగ్నల్స్ బోర్డ్ లను ఏర్పాటు చేయడం, స్పీడ్ బ్రేకర్లు వేయించడం వంటి అనేక రకాలైన ముందస్తు చర్యలు తీసుకొవడం వలన 2025 రోడ్డు ప్రమాదాలవలన చనిపోయిన కేసులు 244 నమోదు కాగా ప్రస్తుతం 221 కేసులు నమోదు కావడం జరిగింది మరియు రోడ్డు ప్రమాదలలో గాయపడిన కేసులు కొంతమేరకు పెరగడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
పైన చూపించిన నివేదికల ఆధారంగా మొత్తానికి నంద్యాల జిల్లాలో 2025 సంవత్సరంలో,4054 కేసులో నమోదు కాగా 2026 సంవత్సరానికి సంబందించి ,జనవరి నుండి అక్టోబర్ వరకు 2973 కేసులు నమోదు కావడంతో నేరాలు గణనీయంగా తగ్గడం జరిగింది.

