📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్బలవంతపు ఉపసంహరణలకు ఒత్తిడి తెస్తే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్న పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

బలవంతపు ఉపసంహరణలకు ఒత్తిడి తెస్తే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్న పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

📰 Generate e-Paper Clip

నిష్పక్షపాతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి: అభ్యర్థులు నిర్భయంగా ప్రచారం చేసుకోండి

• బద్వేల్ నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగడంపై హర్షం

• పోలీస్ యంత్రాంగం అభ్యర్థులకు ధైర్యం కల్పించాలని విజ్ఞప్తి

బద్వేల్: నవంబర్ 16ప్రజావాణి బద్వేల్నీ యోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగడంపై మాజీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.గతంలో జరిగిన ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల మాదిరిగా కాకుండా, ప్రస్తుతం పోలీస్ అధికారులు ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియను నిర్వహిస్తుండటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఎటువంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని గుర్తు చేశారు. గత ఎన్నికల సమయంలో అభ్యర్థులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు. పార్టీ రహితంగా జరిగే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత నిష్పక్షపాతంగా నిర్వహించి,అభ్యర్థులకు ధైర్యం కల్పించాలని కోరారు.ప్రతి ఒక్క ఓటరు ఎటువంటి భయం లేకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు: నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణపై తాను స్వయంగా జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు నాగార్జున రెడ్డి వెల్లడించారు. ఎన్నికలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కాబట్టి బరిలో నిలిచిన ఏ అభ్యర్థి కూడా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, పూర్తి ఆత్మవిశ్వాసంతో, నిర్భయంగా తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఒత్తిడి తెస్తే చర్యలు తప్పవు: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఎవరైనా పోలీస్ అధికారులు బలవంతం చేసినా లేదా ఒత్తిడికి గురిచేసినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని నాగార్జున రెడ్డి కోరారు. అటువంటి అధికారులపై తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకునేలా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.గ్రామాల్లో ప్రశాంతత ముఖ్యం:సర్పంచ్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, సక్రమంగా జరిగితేనే గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొంటుందని నాగార్జున రెడ్డి అభిప్రాయపడ్డారు. అధికార దుర్వినియోగం జరిగి ఎన్నికలు పక్కదారి పడితే, పల్లెల్లో అనవసరమైన ఘర్షణలు,విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.