బద్వేల్, నవంబర్ 15ప్రజావాణి: బద్వేల్ పట్టణంలో ఆదివారం నాడు ఘనంగా జరిగిన ఒక వివాహ మహోత్సవానికి బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.బద్వేల్ టౌన్ వాస్తవ్యులు శ్రీ ఎర్రగొల్ల రాజగోపాల్ యాదవ్, శ్రీమతి వెంకటమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు చిరంజీవి గోపాల స్వామి యాదవ్ మరియు బద్వేల్ టౌన్ వాస్తవ్యులు శ్రీ బత్తల వెంకటరమణ యాదవ్, శ్రీమతి సంటేమ్మ దంపతుల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుమాంజలి గార్ల వివాహ వేడుక బంధుమిత్రుల సమక్షంలో ఎంతో కోలాహలంగా జరిగింది. ఈ శుభకార్యానికి హాజరైన శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి,కి వధూవరుల కుటుంబ సభ్యులు మరియు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదికపైకి చేరుకున్న ఆయన నూతన దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నూతన వధూవరులు జీవితాంతం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని ఆయన ఆకాంక్షించారు.ఇరు కుటుంబాల పెద్దలకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు.ఈ వివాహ వేడుకలో బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు ఇరు కుటుంబాల బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి,
RELATED ARTICLES
