📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనేటి బాలలే....రేపటి బావి భారత పౌరులు

నేటి బాలలే….రేపటి బావి భారత పౌరులు

📰 Generate e-Paper Clip

నేటి బాలలే….రేపటి బావి భారత పౌరులు

బాలల దినోత్సవం సందర్భంగా రేబర్తి గ్రామంలో బాల గ్రామసభ

రేబర్తి గ్రామ సర్పంచ్ నిరాటి శ్రీనివాస్

మద్దూరు నవంబర్14, ప్రజా వాణి,

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రేబర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ నీరాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాల గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని, పెద్దల పట్ల ప్రేమానురాగాలతో మెలగాలని, వారి సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సర్పంచ్ సూచించారు.
ముఖ్యంగా పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి ప్రత్యేక అవగాహన కల్పించడం జరిగింది. వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని వివరించారు.
అలాగే పిల్లలకు విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, మంచి అలవాట్లు మరియు బాలల హక్కుల గురించి అవగాహన కల్పించారు.
ఈ బాల గ్రామసభలో పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం (మిడ్ డే మీల్స్) గురించి చర్చించడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన మరియు పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చూడాలని, భోజన నాణ్యత, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించడం జరిగింది. అలాగే పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు.
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాదులు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యం, భద్రతతో కూడిన వాతావరణం కల్పించడం మనందరి బాధ్యత. పిల్లలు కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు,గురువులకు, గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బియ్య రమేష్, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్,వార్డు సభ్యులు అంకం సోమశేఖర్, జజ్జాల స్రవంతిఫీల్డ్ అసిస్టెంట్ ఐలయ్య, మహిళా సంఘాల సీఐలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.