📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబాలల హక్కులకు భరోసా – గ్రామ అభివృద్ధిలో బాలల భాగస్వామ్యం

బాలల హక్కులకు భరోసా – గ్రామ అభివృద్ధిలో బాలల భాగస్వామ్యం

📰 Generate e-Paper Clip

-బాలల హక్కులకు భరోసా – గ్రామ అభివృద్ధిలో బాలల భాగస్వామ్యం!

-గ్రామ సర్పంచ్ కూరాకుల చిన్న రామయ్య

-అడవిదేవులపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా బాలల గ్రామసభ నిర్వహణ

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 14

అడవిదేవులపల్లి: అడవిదేవులపల్లి గ్రామపంచాయతీలో బాలల హక్కులు, వారి సమస్యలు, విద్య, ఆరోగ్యం, రక్షణ మరియు గ్రామ అభివృద్ధిలో బాలల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో బాలల గ్రామసభను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కూరాకుల చిన్న రామయ్య అధ్యక్షత వహించగా, ఉపసర్పంచ్ బిల్లకంటి రేణుక , ఎంఈఓ వరలక్ష్మి హెడ్మాస్టర్స్ భగవాన్ నాయక్ , మౌనిక , పంచాయతీ కార్యదర్శి దుర్గయ్య , వార్డు సభ్యులు పాల్గొన్నారు.
అలాగే అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు మరియు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలల విద్య, ఆరోగ్యం, పోషకాహారం, తాగునీరు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత, బాలల రక్షణ వంటి అంశాలపై చర్చించారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను, సమస్యలను సభలో తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తు అని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, రక్షణ కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక సమస్యలను నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
బాలల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ, వారి హక్కులను పరిరక్షిస్తూ, బాలల స్నేహపూర్వక గ్రామంగా అడవిదేవులపల్లిని తీర్చిదిద్దడమే బాలల గ్రామసభ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమం బాలల్లో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు మరియు గ్రామాభివృద్ధిపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడింది.

పంచాయతీ కార్యదర్శి
గ్రామపంచాయతీ అడవిదేవులపల్లి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.