అమీన్పూర్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం!
రెండు ఫీడర్ల పరిధిలో గంటపాటు విద్యుత్ నిలిపివేత
వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి
అమీన్పూర్, నవంబర్ 12 (ప్రజావాణి): చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో శుక్రవారం అమీన్పూర్ పరిధిలోని పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అమీన్పూర్ విద్యుత్ శాఖ ఏఏఈ ఆర్. వెంకట్ రామ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చక్రపురి కాలనీ 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలోని రెండు ఫీడర్లపై వేర్వేరు సమయాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని వెల్లడించారు.ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ లాలాబై కాలనీ ఫీడర్ పరిధిలోని లాలాబై కాలనీ, శాంతి శ్రీనగర్, సాయి అంబికా కాలనీ, దుర్గా హోమ్స్, సీత లేఅవుట్, నరేంద్రరావు కాలనీ, నవ్య లేక్, సహస్రనామ బీహెచ్ఈఎల్, గ్రీన్ఫీల్డ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11 కేవీ రాజరాజేశ్వరి ఫీడర్ పరిధిలోని చైతన్య కళాశాల, సాయి అంబికా ఫేజ్, రాజరాజేశ్వరి కాలనీ, పీఎన్ఆర్ కాలనీ, దుర్గా హోమ్స్, అబోడ్ హోమ్స్, సూర్య గ్లోబ్ స్కూల్, భారతనగర్, అమీన్పూర్ పాత గ్రామం, సాయిబాబా ఆలయ పరిసరాలు, బైపాస్ రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.నిర్ణీత సమయాల్లో విద్యుత్ అంతరాయాన్ని గమనించి వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, చెట్ల కొమ్మల తొలగింపు పనులకు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఏఏఈ వెంకట్ రామ్ రెడ్డి కోరారు.


