*దాద్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
– *ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కార్డులు పంపిణీ చేసిన మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి*
– *ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి*
– *కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలను త్వరగా పూర్తి చేసి, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి*
రంగారెడ్డి జిల్లా నవంబర్ 12 (ప్రజావాణి ):మంచాల మండలం దాద్‌పల్లి గ్రామంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనయుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నేనావత్ శాంతి రాజునాయక్, వార్డు సభ్యులు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన పేద ప్రజలకు చేరవేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి పనిచేయాలని సూచించారు.
గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నికపై చర్చించిన ఆయన, ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తూ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చేపడుతున్న గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోందని, వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అభిషేక్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎడ్మ నరేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


