ఎల్ నినో ప్రభావంతో భూ గర్భ జలాలు కాపాడుకోవాలి
దూలిమిట్ట ఎంపీఓ మోహన్
దూళిమిట్టలో సర్పంచులు, కార్యదర్శులతో సమావేశం
మద్దూరు నవంబర్12, ప్రజా వాణి,
ధూళిమిట్ట మండలంలోని సమస్త సర్పంచ్ లు మరియు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి దిగువ విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ ఓ మోహన్ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం భూగర్భ జలాల “రీదార్డ్- మరియు ఉపరితల నీటి వనరుల లభ్యతపై కలిగే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని దూళిమిట్ట మండల పరిదిలోని అన్ని గ్రామాలలో త్రాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించి, ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా జరిగేలా తగిన చర్యలు చేపట్టలని కోరారు.
సమావేశంలో చర్చించిన అంశాలు:
మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రస్తుత త్రాగునీటి సరఫరా పరిస్థితి మరియు నీటి వనరుల లభ్యతపై సమీక్ష
భూగర్భ జలాలు మరియు ఉపరితల నీటి వనరుల ప్రస్తుత పరిస్థితి అంచనావేయడం
త్రాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్న గ్రామాలు మరియు ఆవాసాలను గుర్తించడం.
ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టడం
త్రాగునీటి సరఫరాకు సంబంధించిన మరమ్మతులు మరియు ఇతర సమస్యలను పరిష్కరించడం.
ప్రతి గ్రామంలో త్రాగునీటి సరఫరా నిరంతరాయంగా జరిగేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు.
ఈ సమావేషంలో
ఎంపీఓ మోహన్, ఏ ఈ ప్రవళిక,సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు, సూపర్ వేజర్ లు పాల్గొన్నారు


