విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ పడొద్దు
సిద్దిపేట కలెక్టర్ హైమావతి
బెజ్జంకి,నవంబర్ 3 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మంగళవారం సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.అలాగే పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్,ఉపసర్పంచ్ మహేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

