📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకుందారం, చీటూరు గ్రామాలలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు

కుందారం, చీటూరు గ్రామాలలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు

📰 Generate e-Paper Clip

కుందారం, చీటూరు గ్రామాలలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి..

ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి..

క్లస్టర్ ఇంచార్జ్ గోపాలదాస్ ఉపేందర్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03(ప్రజావాణి): జిల్లా లోని లింగాల ఘనపూర్ మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి.

స్వరాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ డా. తాటికొండ రాజయ్య ఆదేశానుసారం మండలంలోని కుందారం, చీటూరు గ్రామాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదుపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశాలకు లింగాల ఘనపూర్ మండల సమన్వయ కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ ఎన్నికల క్లస్టర్ ఇంచార్జ్ గోపాలదాస్ ఉపేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైనవని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సమష్టిగా, అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పట్టభద్రుల ఓటరు నమోదు (ఎన్రోల్మెంట్) కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, గ్రామంలో అత్యధిక సంఖ్యలో ఓటర్ల నమోదు జరిగేలా కృషి చేయాలని సూచించారు. గ్రామంలో అర్హులైన ఒక్క పట్టభద్రుడు కూడా మిగిలిపోకుండా ఇంటింటికీ వెళ్లి, అవగాహన కల్పించి నమోదు చేయించాలని కోరారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే నమోదు పూర్తి చేయాలని తెలిపారు.

పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించగల సమర్థుడైన అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపుతుందని, కాబట్టి పట్టభద్రులందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో కుందారం, చీటూరు గ్రామ శాఖ అధ్యక్షులు ఆగరాజు, రమేష్, మాజీ ఎంపీటీసీ కుమార్, మాజీ ఉప సర్పంచ్ ఖలీల్, అశోక్, యాదగిరి, రాజు, మహేష్, చంద్రశేఖర్ రావు, రాయపు రెడ్డి, నర్సయ్య, పరుశరాములు తదితర నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.